Amitabh Kant explains why $100000 H-1B visa fee is not a setback for India | హెచ్1-బీ వీసాల రుసుమును ఏడాదికి ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దింతో యూఎస్ లోని వివిధ టెక్నాలజీ కంపెనీల్లో పని చేస్తున్న విదేశీయులపై గుదిబండ పడినట్లైంది. కాగా హెచ్1-బీ వీసాదారుల్లో 70 శాతానికి పైగానే భారతీయులు ఉన్నారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలోని భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందించారు. ఇది భారత్ కు సువర్ణ అవకాశం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ యొక్క 100,000 డాలర్ల H-1B ఫీజు అమెరికా ఆవిష్కరణలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. భారతదేశ ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. గ్లోబల్ టాలెంట్‌పై తలుపులు మూసివేయడం ద్వారా, అమెరికా తదుపరి తరం ప్రయోగశాలలు, పేటెంట్లు, ఆవిష్కరణలు మరియు స్టార్టప్‌లకు బెంగళూరు, హైదరాబాద్, పూణే మరియు గుర్గావ్ లు స్వర్గధామం అవుతాయి.
భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు భారతదేశ అభివృద్ధి మరియు వికసిత్‌భారత్ లక్ష్యం వైపు పురోగతికి దోహదపడే అవకాశం లభించింది. అమెరికా నష్టం భారతదేశ లాభం అవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.









