Kavitha Kalvakuntla About Harish Rao | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కవిత చేరికను కచ్చితంగా వ్యతిరేకిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత..కాంగ్రెస్ లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని, కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలీదని, బహుశా భయపడుతున్నట్లు ఉన్నారని పేర్కొన్నారు.
సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు పై ఇంకా ఆలోచన చేయలేదన్నారు. కానీ రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆ లేఖను ఛైర్మన్ కు పంపినట్లు ఆమోదించాలని ఆయన్ను కోరినట్లు వివరించారు. మరోవైపు కాళేశ్వరం అంశం మినహా హరీష్ రావుపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు.









