Trump Slaps $100,000 Fee On H-1B Visas | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్1-బి వీసా వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై శుక్రవారం రాత్రి సంతకం చేశారు.
ఈ నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 21 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. కాగా అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఈ వీసాను తీసుకువచ్చారు. ఇందులో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు.
మరో 11 శాతం చైనా దేశస్థులు ఉన్నారు. హెచ్1-బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసి వచ్చే సంపాదనలో అధిక భాగం వీసా రుసుముకే వెళ్ళిపోతే ఎలా అని పలువురు ఆందోళన చెందుతున్నారు.
కాగా ఫీజు పెంచడం పట్ల ట్రంప్ స్పందించారు. దేశ భద్రతను దృషిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశంలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.









