Yogi assures security to Disha Patani’s family after firing at Bareilly home | ఉత్తరప్రదేశ్ బరేలీలోని నటి దిశా పటానీ ఇంటి ముందు ఇటీవల కొందరు దుండగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిశా పటానీ తండ్రి, మాజీ పోలీసు అధికారి అయిన జగదీశ్ సింగ్ పటానీకి సీఎం యోగి ఫోన్ చేసి ధైర్యమిచ్చారు.
కాగా దిశా పటానీ సోదరి అయిన ఖుష్బూ పటానీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఆమె ఒక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు దుండగులు పటానీ ఇంటిముందు కాల్పులు జరిపారు. ఈ పని చేసింది తామే అంటూ గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది.
ఈ నేపథ్యంలో సీఎం యోగి జగదీష్ పటానీకి ఫోన్ చేశారు. నిందితులు అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పటానీ కుటుంబానికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.









