Social worker protests Over potholes by sitting on damaged road in Karimnagar | కరీంనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త కోట శ్యామ్ వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
రోడ్డు మీద ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్, సీటు బెల్టు ఏది ధరించకపోయినా తాను ఫైన్ కడుతున్నానని మరీ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని అధికారులు తనకు ఎంత ఫైన్ కడుతారు అంటూ నిలదీశారు.
దీనికి సంబంధించిన వీడియో అందర్నీ ఆలోచించేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల రహదారి గుంతలమయంగా మారింది. చిన్న వర్షం పడినా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంతలమాయమైన రోడ్డుపై శ్యామ్ బైఠాయించారు.
జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను రోడ్డు బాలేనందుకు ఫైన్ తనకు కట్టాలని నిలదీశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్ వసూలు చేస్తున్నారు, మరీ గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రజలు ప్రాయాణించవల్సి వస్తుందని అసహనం వ్యక్త పరిచారు. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తనకు రూ.10 వేల జరిమానా చెల్లించాలని ప్లకార్డు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.









