Are Dhanush and Mrunal Thakur really dating? | నటుడు ధనుష్, నటి మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇదే సమయంలో ధనుష్ కుటుంబ సభ్యులను మృణాల్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ధనుష్ సోదరీమణులు కార్తిక, విమల గీతను మృణాల్ తాజగా కలిసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆమెను ధనుష్ తన కుటుంబానికి పరిచయం చేశారని ప్రచార సారాంశం. కొన్నిరోజుల నుంచి ధనుష్-మృణాల్ తరుచుగా కలిసి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం మొదలయ్యింది. ‘సన్ ఆఫ్ సర్దార్-2’ ఈవెంట్ కు ధనుష్ హాజరయ్యారు. ఆ తర్వాత మృణాల్ బర్త్ డే పార్టీకి ధనుష్ వెళ్లారు. వీళ్ళిద్దరూ చనువుగా మెలుగుతుండడంతో డేటింగ్ ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతుంది.









