Thursday 18th September 2025
12:07:03 PM
Home > తాజా > ‘వివేక్ వెంకటస్వామి అనే నేను..’ మంత్రి గడ్డం వివేక్ ప్రస్థానమిదే!

‘వివేక్ వెంకటస్వామి అనే నేను..’ మంత్రి గడ్డం వివేక్ ప్రస్థానమిదే!

Minister Gaddam Vivek | తెలంగాణ కేబినెట్ విస్తరణ (Telangana Cabinet Expansion) లో కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డ వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkataswamy) కూడా చోటు దక్కించుకున్నారు.

ఆదివారం రాజ్ భవన్ లో ఆయన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం వెంకటస్వామి చిన్న కుమారుడైన వివేక్ 2009లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వెంకటస్వామి వారసుడిగా 2009లో పెద్దపల్లి లోక్ సభ నుంచి ఎంపీగా గెలుపొందారు.

అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆరెస్ లో చేరారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తిరిగి సొంతగూటికి చేరారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ బీఆరెస్ లో చేరి, కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అయితే 2019లో టికెట్ రాకపోవడంతో రాజీనామా చేసి బీజేపీలో చేరి, కీలక బాధ్యతలు చేపట్టారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. కాగా, వివేక్ సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, కుమారుడు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్నారు.

You may also like
tgsrtc yatradanam
అనాథలు, వృద్ధుల కోసం టీజీఎస్ఆర్టీసీ ‘యాత్రాదానం’!
హుస్సేన్ సాగర్ వద్ద సీఎం ఆకస్మిక పర్యటన
‘కవిత వెనుక కాంగ్రెస్..అందుకే సస్పెండ్’
ktr
మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో తెలుసా: కేటీఆర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions