No fuel price hike for consumers; govt assures after hiking excise duty by Rs.2 | కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి నుండి పెంచిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
అయితే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెరిగినా ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్రం స్పష్టం చేసింది. ఎక్సైజ్ డ్యూటీని చమురు మార్కెటింగ్ కంపెనీలే భరిస్తాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని పెట్రోలియం శాఖ తెలిపింది.
ఈ చర్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయమని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. మరోవైపు అమెరికా -చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మాంద్యం భయాలు, ఒపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపు వంటి అంతర్జాతీయ ఆర్థిక భయాల నేపథ్యంలో కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్న తరుణంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచడం పట్ల ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.