Woman gives birth in AP Sampark Kranti Express train | రైలులోనే ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు ( Andhra Pradesh Sampark Kranti Express ) హజ్రాత్ నిజముద్దీన్-తిరుపతి మధ్య రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలులో ప్రయాణిస్తున్న మహిళకు ఒక్కసారిగా పురటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన రైల్వే సిబ్బంది తోటి ప్రయాణికుల సహాయంతో కదులుతున్న రైలులోనే సురక్షితంగా ప్రసవం చేశారు.
విజయవంతంగా డెలివరీ చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రైల్వే వైద్య బృందం మథుర వద్ద తల్లీ బిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. తల్లీ బిడ్డకు శుభాకాంక్షలు చెబుతున్నారు.









