Sunday 6th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గణతంత్ర వేడుకలు..ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ప్రధాని తలపాగా

గణతంత్ర వేడుకలు..ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ప్రధాని తలపాగా

PM Modi Vibrant Turban For Republic Day | 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగిన రిపబ్లిక్ పరేడ్ ( Republic Day Parade ) లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Droupadi Murmu ) జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Modi ), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని ధరించిన తలపాగా అందర్నీ ఆకర్షించింది.

ఏటా స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ రాష్ట్రాల సంస్కృతికి ప్రతీకగా ప్రధాని తలపాగాలు దరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని ‘సఫా’ ను ధరించారు.

రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ఆయన ఈ తలపాగాను ధరించారు. ఎరుపు, పసుపు కలగలిసిన వర్ణంతో సఫా తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2024 గణతంత్ర వేడుకల్లో ప్రధాని గుజరాత్ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఆయన తలపాగాను ధరించిన విషయం తెల్సిందే.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
‘హిందీ రుద్దలేరు..20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరులు’
‘ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సహాయం..అందులో నిజం లేదు’
ఇద్దరు కుమారులతో పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions