Manchu Manoj Social Media Post About Manchu Vishnu | మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu ) కుటుంబంలో నెలకొన్న విభేదాలు ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు.
సంక్రాంతి పండుగ వేళ తిరుపతి వేదికగా ఎంతటి హైడ్రామా నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో నటుడు మంచు మనోజ్ మరోసారి ఎక్స్ ( X ) వేదికగా ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు.
‘కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లోని మహిళల్ని, నాన్నను, ఉద్యోగుల్ని మరియు చెక్కరని పక్కన పెట్టి మనమే మాట్లాడుకుందాం..ఏం అంటావ్? నేను మాట ఇస్తున్నా నేను ఒక్కడ్నే వస్తా నీకు నచ్చిన వారిని నువ్వు తీసుకుని రా లేదా ఆరోగ్యకరమైన డిబేట్ ( Debate ) పెట్టుకుందాం. ఇట్లు నీ కరెంట్ తీగ’ అని మనోజ్ పేర్కొన్నారు.
అలాగే మరొక పోస్ట్ లో కన్నప్ప మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజులాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందని ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ అంటూ మనోజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విస్మిత్ ( #vismith ) అనే కోడ్ ఇచ్చి తాను ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశానో తెలుసుకోవాలని ఈ నటుడు రాసుకొచ్చారు.