Wednesday 23rd July 2025
12:07:03 PM
Home > తాజా > పండగ ముందు మందుబాబులకు షాక్..రాష్ట్రంలో బీర్లు బంద్

పండగ ముందు మందుబాబులకు షాక్..రాష్ట్రంలో బీర్లు బంద్

United Breweries has stopped supplying KF Beer to Telangana | తెలంగాణలోని మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది.

సంక్రాంతి పండుగ ముందే రాష్ట్రానికి తమ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ( United Breweries Limited ) సంచలన ప్రకటన చేసింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీనే కింగ్ ఫిషర్ ( Kingfisher ) బీర్లను సప్లై చేస్తుంది.

కింగ్ ఫిషర్ బీర్లు సహా ఏడు రకాల బీర్లను తెలంగాణకు సప్లై ( Supply ) చేయబోమని సదరు సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి ప్రధానంగా రెండు కారణాలను వెల్లడించింది.

తెలంగాణలో 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ధరలు పెంచలేదని, పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా ధరలు పెంచకపోవడం మూలంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ వెల్లడించింది. అలాగే టీజీబీసిఎల్ ( TGBCL ) నుండి రావాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని పేర్కొంది.

ఈ కారణాల నేపథ్యంలో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు యూబిఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు సెబీ ( SEBI )కి లేఖను రాసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని కొందరు మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.

You may also like
‘వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాలు’
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
‘ఆ ఇద్దరి వల్లే హరిహర వీరమల్లు సాధ్యం అయ్యింది’
‘కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions