Cm Revanth Reddy Warning To Tollywood | సంధ్య థియేటర్ ( Sandhya Theater ) తొక్కిసలాట ఘటన అటు రాజకీయాలను ఇటు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.
శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) మరియు సినీ ప్రముఖుల వ్యవహార శైలి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంతవరకు ఇక బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఉండబోదని కుండ బడ్డలుకొట్టారు. సినిమా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతామంటే మాత్రం చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాలకు బిగ్ షాక్ తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా తొలుత రాం చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న మూవీ ‘గేమ్ చేంజర్’ ( Game Changer ), అలాగే బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ తెరకెక్కిస్తున్న మూవీ ‘డాకు మహారాజ్’ మరియు వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
ఈ మూడు సినిమాల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోందో అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.