52 Kg Gold And Rs.10cr Found In Abandoned Innova Car | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) రాష్ట్రంలో విడిచిపెట్టిన ఓ కారులో రూ.10 కోట్ల నగదు, 52 కిలోల బంగారం లభించడం సంచలనంగా మారింది.
అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో 30 వాహనాల్లో వందమంది పోలీసులు బయకుదేరారు.
ఈ సందర్భంగా భోపాల్ ( Bhopal ) సిటీకి సమీపంలోని మెందోరి ( Mendori ) అటవీ ప్రాంతంలో ఆగివున్న ఇన్నోవా కారును పొలిసులు గుర్తించారు. వెంటనే కారును చుట్టుముట్టారు. కానీ అందులో ఎవరూ లేరు.
కారును తనిఖీ చేయగా అందులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు లభ్యం అయ్యింది. ఇన్నోవా కారు గ్వాలియర్ కు చెందిన చేతన్ గౌర్ దిగా గుర్తించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.