Vijay Sethupathi Sai Pallavi Wins Best Actors Award At CIFF | తమిళ చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ( CIFF ) వేడుక గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది.
కోలీవుడ్ ( Kollywood ) స్టార్లు సందడి చేశారు. ఇందులో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘అమరన్’ మూవీకి అవార్డుల పంట పండింది. ఆమరన్ ( Amaran ) మూవీకి గాను ఉత్తమ నటిగా సాయి పల్లవి ( Sai Pallavi ) , మహారాజ మూవీకి గాను విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు.
అవార్డు గెలవడం పట్ల సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో పోటీ నెలకొన్న సమయంలో తనను అవార్డు వరించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. దేశం కోసం ఎంతో శ్రమించిన ముకుంద్ మరియు ఆయన కుటుంబ సభ్యుల మూలంగానే ఇది సాధ్యమయినట్లు ఆమె చెప్పారు.
ఉత్తమ చిత్రం, నటి, సినిమాటోగ్రఫీ, ఎడిటర్, సంగీత దర్శకుడు వంటి విభాగాల్లో అమరన్ మూవీ అవార్డులను గెలుచుకుంది.