Amit Shah Remarks On Ambedkar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్. అంబేడ్కర్ ( BR Ambedkar ) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలని విపక్షాల డిమాండ్ తో బుధవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ క్రమంలో సభ గురువారానికి వాయిదా పడింది.
మరోవైపు పార్లమెంటు ప్రాణగణంలో ఇండీ కూటమి ( INDI Alliance ) ఎంపీలు అమిత్ షా కు వ్యతిరేకంగా నినదించారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని పట్టుకుని జై భీం అని నినాదాలు చేశారు. మనుస్మృతిని విశ్వసించే వారికి అంబేడ్కర్ సిద్ధాంతాలతో సమస్య ఉంటుందని బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వ్యాఖ్యానించారు.
దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్, ఆయన రుపొందించిన రాజ్యాంగాన్ని అవమానించడాన్ని దేశం సహించదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.