RGV Tweet on Allu Arjun Arrest | సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ శుక్రవారం పోస్ట్ చేసిన ఆయన తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై మరో సెటైరికల్ ట్వీట్ చేశారు.
“తెలంగాణకు చెందిన పెద్ద స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారతీయ సినీ చరిత్రలోనే అతి పెద్ద విజయంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ ను జైలుకు పంపి తెలంగాణ ప్రభుత్వం అతనికి పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది” అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ.
అంతకు ముందు బ్రహ్మోత్సవాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు మరణిస్తే దేవుళ్లను అరెస్టు చేస్తారా, రాజకీయ సభల తోపులాటలో ప్రజలు చనిపోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ఆర్జీవీ.