Thursday 12th December 2024
12:07:03 PM
Home > తాజా > లగచర్ల రైతుకు బేడీలు..సీఎం రేవంత్ కన్నెర్ర

లగచర్ల రైతుకు బేడీలు..సీఎం రేవంత్ కన్నెర్ర

CM Revanth Reddy Serious on Police Over Handcuffing to Farmer | హీర్యా నాయక్ అనే రైతుకు బేడీలు వేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు.

వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగిన కేసులో గత నెల రోజులుగా సుమారు 45 మంది సంగారెడ్డి జైలులో ఉన్నారు. అయితే ఇందులో హీర్యా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి వచ్చింది.

దింతో పోలీసులు రైతుకు బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దింతో పోలీసుల తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం స్పందించారు.

హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలను ఆరా తీసిన ముఖ్యమంత్రి రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని సీఎం రేవంత్ హెచ్చరించారు.

You may also like
అతుల్ సుభాష్ ఆత్మహత్య..#Mentoo ట్రెండింగ్
రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి..అంగీకరించిన నితిన్ గడ్కరీ
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్..#fortheloveofnyke
‘తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions