Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బాబుగారి ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంది

బాబుగారి ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంది

Ys Jagan News Latest | చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్.

మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం తనకు ఆవేదన కలిగించిందన్నారు. చంద్రబాబు రాగానే విద్యారంగాన్ని దెబ్బతీశారని జగన్ ఆరోపించారు.

అమ్మ వడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, వసతి దీవెన వంటి పథకాలను ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొన్నారు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదని, ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

You may also like
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions