Thursday 24th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్

APCOS Employees Thanked Deputy Cm Pawan Kalyan | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ( Medical And Health Department Oursourcing Employees ) ఉద్యోగులు.

‘ఔట్ సోర్సింగ్ విధానంలో ఆప్కాస్ ( APCOS ) ద్వారా ఉద్యోగాల్లో చేరాము. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 23 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాము. విధుల్లో చేరిన నాటి నుంచి వేతనాలు లేవు. అప్పులు చేసి కుటుంబాలు నెట్టుకొస్తున్నాము. మేము పని చేసిన కాలానికి జీతాలు ఇప్పించండి సార్. ఉద్యోగ భద్రత కల్పించండి’ అంటూ గత నెలలో మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు.

సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి జీతం బకాయిల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడం పట్ల మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను నాలుగు వారాలలోపు పరిష్కరించినందుకు పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటామన్నారు.

You may also like
‘తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేయాలి’
పవన్ సినిమాకు అంబటి రాంబాబు ఆల్ ది బెస్ట్
పెద్దిరెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
కేబీకే గ్రూప్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions