Saturday 19th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పండగ రోజు సీఎం చంద్రబాబు ఇంటికి మెగాస్టార్

పండగ రోజు సీఎం చంద్రబాబు ఇంటికి మెగాస్టార్

Megastar Chiranjeevi Meets Cm Chandrababu | దసరా పండుగ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) నివాసానికి మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) వెళ్లారు.

కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తెలుగురాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెల్సిందే. వరద బాధితుల సహాయార్ధం మెగాస్టార్ చిరంజీవి తెలుగురాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఆయన తరఫున రెండు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ ( Hyderabad ) లోని చంద్రబాబు నివాసానికి మెగాస్టార్ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan )తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు.

విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

You may also like
‘మనసుకు చాలా సంతోషంగా ఉంది’
‘రేవంత్ క్షమాపణలు చెప్పు..లేదంటే’
‘రహస్యంగా కేటీఆర్ లోకేశ్ ను ఎందుకు కలిశాడు’
‘వైఎస్సార్ కొడుకై ఉండి’..షర్మిల సంచలనం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions