Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > ఖమ్మంలో అకాల వర్షాలు..అమిత్ షాకు పరిస్థితిని వివరించిన బండి

ఖమ్మంలో అకాల వర్షాలు..అమిత్ షాకు పరిస్థితిని వివరించిన బండి

Heavy Rains In Khammam | తెలంగాణ రాష్ట్రంలో రెండురోజులుగా ఎడతెరుపులేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం ( Khammam ) జిల్లాలో వరదలు ఉదృతంగా మారాయి.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Home Minister Amit Shah ) కు వివరించారు కేంద్ర సహాయక శాఖామంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ).

ఖమ్మంలో తీవ్ర పరిస్థితి మరియు జిల్లాలో 110 గ్రామాలు మునిగిపోయాయని, ప్రకాష్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తండా కొండపై 68 మంది, 42 మంది చిక్కుకుపోయారని కేంద్ర హోంమంత్రి కి బండి సంజయ్ తెలియజేసారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ఆదేశాల మేరకు చెన్నై, విశాఖపట్నం, అస్సాం నుంచి మూడు చొప్పున 9 ఎన్‌డిఆర్‌ఎఫ్ ( NDRF ) బృందాలను తెలంగాణకు పంపించినట్లు చెప్పారు.

అలాగే, మంత్రి పొంగులేటి ( Ponguleti Srinivas Reddy )తో పరిస్థితి మరియు కొనసాగుతున్న సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి చర్చించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

You may also like
హనుమంతుడిపై రాజమౌళి వ్యాఖ్యలు..బండి సంజయ్ షాకింగ్ రియాక్షన్
‘అర్బన్ నక్సలైట్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోవద్దు’
‘వావివరుసలు లేవు..సొంత కూతురు ఫోన్ కూడా ట్యాప్ చేశారు’
‘సీఎం రమేష్ సాయం వల్లే కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions