Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > ఈ మూడు కూల్చివేసే దమ్ము రేవంత్ కు ఉందా : బీజేపీ

ఈ మూడు కూల్చివేసే దమ్ము రేవంత్ కు ఉందా : బీజేపీ

BJP Kishan REddy

Telangana BJP On HYDRA | అక్రమ నిర్మాణాలను కులుస్తూ ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుంటూ హైడ్రా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఇందులో ఎటువంటి రాజకీయ లక్ష్యం లేదని సీఎం రేవంత్ ( Cm Revanth ) స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ( Telangana BJP ) హైడ్రాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ప్రధానంగా మూడు నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే హైడ్రా యొక్క అసలు ఉద్దేశాలు స్పష్టం అవుతాయని బీజేపీ పేర్కొంది.

మొదట సల్కం చెరువును ఆక్రమించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) కి చెందిన సంస్థలు, కేటీఆర్ ఫార్మ్ హౌస్ ( Janwada Farmhouse ) మరియు ఇతర బీఆరెస్ నాయకుల అక్రమ నిర్మాణాలపై, కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్ లపై చర్యలు తీసుకున్నప్పుడే హైడ్రా అసలు ఉద్దేశ్యం నిరూపితం అవుతుందని బీజేపీ తెలిపింది.

కానీ వీటిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి ఉందా ? అని కాషాయ పార్టీ ప్రశ్నించింది.

You may also like
గెలుపే లక్ష్యంగా తెలంగాణ వైపు బీజేపీ అధిష్టానం చూపు
హుస్సేన్ సాగర్ వద్ద సీఎం ఆకస్మిక పర్యటన
‘తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమను ఎవరూ తగ్గించలేరు’
గోడ తీస్తే 3 కి.మీ..మూస్తే 8 కి.మీ.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions