Tuesday 29th April 2025
12:07:03 PM
Home > తాజా > వరద నీటిలో బైక్ పై వెళ్తున్న జంట..రెచ్చిపోయిన ఆకతాయిలు |

వరద నీటిలో బైక్ పై వెళ్తున్న జంట..రెచ్చిపోయిన ఆకతాయిలు |

Viral News | వరద నీటిలో బైక్ మీద వెళ్తున్న ఓ జంటపై కొందరు ఆకతాయి యువకులు రెచ్చిపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాజధాని లక్నో ( Lucknow ) లో చోటుచేసుకుంది.

లక్నో లోని తాజ్ హోటల్ వంతెన కింద భారీ వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు చేరుకుంది. అయితే ఈ వరద నీటిలోకి కొందరు పోకిరీలు చేరి వాహనదారులు ఇబ్బందులకు గురి చేసారు.

బైక్ ( Bike ) పై వస్తున్న ఓ జంటపై బురద నీటిని చల్లుతూ, వెనకాల కూర్చున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దింతో సదరు జంట వరద నీటిలో పడిపోయింది. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరి మూకను చెదరగొట్టి, బాధితులను అక్కడి నుండి పంపించారు.

అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ ( Viral ) గా మారింది. జంటపై వరద నీరు చల్లుతూ వికృతానందం పొందిన పోకిరీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు పోకిరీలపై కేసును నమోదు చేసి, వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి ఖరారు..ఇంతలోనే’
amith shah
రాష్ట్రాల సీఎంలకు హోం మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions