Telangana DGP Ravi Gupta | వర్షాకాలం నేపథ్యంలో తెలంగాణ డీజీపీ (Telangana DGP) వాహనదారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా రవి గుప్త పలు జాగ్రత్తలు తెలిపారు.
వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని ఎక్స్ వేదికగా సూచించారు. “వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోండి. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి.
వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో ప్రయాణించటం ఎల్లవేళలా మంచిది. వాహన ఇంజిన్ కండిషన్, బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించండి. ఎప్పుడైనా అవసరం వస్తే మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
అత్యవసర సమయాల్లో 100కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోండి’ అని సూచించారు.