Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > రేవంత్ రెడ్డే సీఎం అని ముందే చెప్పి ఉంటే 30 సీట్లు కూడా రాకపోతుండే!

రేవంత్ రెడ్డే సీఎం అని ముందే చెప్పి ఉంటే 30 సీట్లు కూడా రాకపోతుండే!

ktr in brs meeting
  • కాంగ్రెస్ గెలుస్తదని సీఎం సొంత ఊర్లో కూడా అనుకోలే
  • రేవంత్ రెడ్డి సీఎం లెక్క మాట్లాడుతలేడు
  • మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు
  • ఇటుకలతోని కొడితే రాళ్లతోని కొడుతం
  • పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కపోతం, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితారని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాకపోతుండేనని వ్యాఖ్యానించారు.

సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లి లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం లేదనీ, లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నారని విమర్శించారు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరగరని కేటీఆర్ మండిపడ్డారు. లంకె బిందెలు వెతికే రేవంత్ రెడ్డి పాత బుద్దులు మళ్ళీ బయటకి వస్తున్నాయన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులు భరిస్తామనీ.. తర్వత వాళ్లు ఇటుకలతోని కొడితే మేము రాళ్లతోనే కొడతామని హెచ్చరించారు.

గ్రేటర్ లో బీఆరెస్ కు వరుస షాక్ లు!

కరెంటు కోతలు.. తాగునీటి గోసలు

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమయ్యానీ, మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కనీసం మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

అప్పుడేమో అందరికీ.. ఇప్పుడేమో కొందరికే..

కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదన్నారు కేటీఆర్. అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని తెలిపారు. అందరికీ అన్ని ఇస్తామన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఆడబిడ్డలకి రూ. 2500 ప్రతినెలా ఇస్తామన్నారు.. ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ రూ. 4,000 చొప్పున ఇస్తామన్నారు. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారు. వాళ్లందరి నెలకు 2500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నడు. కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు. 200 యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారు. వందరోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నాము. శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం.కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే మా పార్టీ పైన, మా పార్టీ అధినేత పైన అడ్డగోలుగా విమర్శలు చేశారు” అని వ్యాఖ్యానించారు కేటీఆర్.

You may also like
తెలంగాణ ఊర్లల్ల అసలైన దసరా సంబురం ఇదే.. ఓ ఎన్నారై యాది!
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
Amrapali reddy kata
నగరంలో వాటిపై నిషేధం.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన ఆదేశాలు!
cm revanth reddy
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions