Saturday 19th July 2025
12:07:03 PM
Home > తాజా > ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి!

ధరణిపై సీఎం రేవంత్ సమీక్ష.. నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి!

cm revath reddy

CM Revanth Review On Dharani Portal | తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే విద్యుత్, టీఎస్పీఎస్సీ, రైతు బంధు అంశాలను టేకప్ చేసిన రేవంత్ రెడ్డి.. తాజాగా సమస్యల నిలయంగా మారిన ధరణి పోర్టల్‌పై ఫోకస్ పెట్టారు.

కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహ్మతా జ్యోతిబాపూలే భవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌లో సైతం ఎక్కువగా ధరణి పోర్టల్‌పైనే ఫిర్యాదులు రావడంతో రేవంత్ దీనిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం మధ్నాహ్నం సచివాలయంలో ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి రెవిన్యూ మంత్రి పొంగులేటి, సంబంధిత శాఖ అధికారులు హాజరుకానున్నారు. అయితే, భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ సమస్యల నిలయంగా మారిన విషయం తెలిసిందే.

ధరణి పోర్టల్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అంతేకాకుండా ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ నేతలు అధికారులతో కుమ్మక్కై అసైన్డ్ ల్యాండ్స్‌ను, ఇతర ప్రభుత్వ భూములను రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కబ్జా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి దాని స్థానంలో కొత్త విధానం తీసుకువస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అధికారంలో రావడంతో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమస్యల కుప్పగా మారిన ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ వేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌పై తదుపరి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక, అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో.. ఇవాళ్టి సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

You may also like
ktr pressmeet
లోకేశ్ ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్
‘మనసుకు చాలా సంతోషంగా ఉంది’
‘రేవంత్ క్షమాపణలు చెప్పు..లేదంటే’
‘రహస్యంగా కేటీఆర్ లోకేశ్ ను ఎందుకు కలిశాడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions