Sunday 20th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఛత్తీస్ ఘడ్ సీఎం ను ప్రకటించిన బీజేపీ..ఎవరంటే..!|

ఛత్తీస్ ఘడ్ సీఎం ను ప్రకటించిన బీజేపీ..ఎవరంటే..!|

Chattisgarh New Cm| ఛత్తీస్ ఘడ్ ( Chattisgarh ) నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి ( Visnu Deo Sai ) ని ప్రకటించింది బీజేపీ ( Bjp ).

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించింది బీజేపీ. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో 54 సీట్లతో సంపూర్ణ మెజారిటీ ( Majority ) సాదించింది బీజేపీ.

అయితే ఫలితాలు వచ్చి వారం రోజులు అవుతున్న సీఎం ( Cm ) ఎవరనేదాని పై మాత్రం సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశం అయిన బీజేపీ ఎల్పీ ( LP ) గిరిజన నేత, మాజీ కేంద్ర మంత్రి విష్ణు దేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

కాగా విష్ణు దేవ్ మాజీ సీఎం రమన్ సింగ్ ( Raman Singh ) కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ప్రధాని మోదీ ( Pm Modi ), బీజేపీ ని గెలిపిస్తే ఒక గిరిజన వ్యక్తిని సీఎం చేస్తాం అని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో విష్ణు దేవ్ సాయి ని ప్రకటించడం విశేషం.

You may also like
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’
‘ముద్దిస్తావ అన్నాడు..ఎదురైన ఘటనను చెప్పిన నటి మాళవికా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions