Friday 22nd November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Free bus travel for women from today

బోధన్‌: నేటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు బోధన్‌ బస్‌ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేటి మధ్యాహ్నం 2నుండి మహిళలకు, ట్రాన్స్‌ జెండర్స్‌ లకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్‌ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ప్రయాణికులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించబడిన ఏదైనా పత్రాన్ని (ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడి కార్డ్‌, పాన్‌ కార్డు, పాస్పోర్ట్‌ బుక్‌, రేషన్‌ కార్డ్‌ ఇతరములు), కండక్టర్‌ కు చూపెట్టాలని సూచించారు. అంతరాష్ట్రాలకు వెళ్లే మహిళ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితంగా అనుమతించబడు తుందని, అక్కడి నుండి టికెట్‌ ఛార్జ్‌ వసూలు చేయబడుతుందని తెలిపారు. మహిళ ప్రయాణికులతో లగేజ్‌ 50 కేజీ పైబడి ఉన్నట్లయితే దానికి ఛార్జ్‌ వసూలు చేయబడుతుందన్నారు.

You may also like
బీరు బిర్యానీ వ్యాఖ్యలు..మరో వివాదంలో కొండా సురేఖ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు
కంగారూలనే కంగారు పెట్టించిన బూమ్ బూమ్ బుమ్రా
జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions