Friday 14th March 2025
12:07:03 PM
Home > సినిమా > ‘ఆమె’ తరువాత వరుస హిట్లు పడ్డాయన్న శ్రీకాంత్

‘ఆమె’ తరువాత వరుస హిట్లు పడ్డాయన్న శ్రీకాంత్

Srikanth said that after 'Aame' there were a series of hits

-‘మహాత్మ’ తరువాత దెబ్బపడిందని వ్యాఖ్య
-వరుస ఫ్లాపులు చూడటం జరిగిందని వెల్లడి
-కొత్త హీరోలు రావడం కావొచ్చనే అభిప్రాయం

హీరోగా శ్రీకాంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలదొక్కుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో 100 సినిమాలను పూర్తిచేయడం చాలా కష్టమైన విషయం. కానీ శ్రీకాంత్ ఆ సంఖ్యను చాలా తేలికగా దాటేశాడు. రీసెంటుగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.
‘ఆమె’ సినిమా తరువాత ‘తాజ్ మహల్’ , ‘పెళ్లి సందడి’ వంటి పెద్ద హిట్లు పడ్డాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆ తరువాత చేయడానికి మూడు సినిమాలు రెడీగా ఉండేవి. హిట్ పడేసరికి పెద్ద బ్యానర్లు వచ్చేవి. అంతకుముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి, ఆ పెద్ద బ్యానర్లు వెనక్కి పోయేవి. అలా జరుగుతూ వచ్చింది.
‘మహాత్మ’ తరువాత నాకు పెద్ద దెబ్బపడింది. ఆ సినిమా తరువాత నా కెరియర్ మెల్లగా డౌన్ కావడం మొదలైంది. మంచి సినిమాలే ఒప్పుకుంటూ వచ్చినప్పటికీ, అలా గ్రాఫ్ పడిపోతూ వెళ్లింది. ‘మహాత్మ’ తరువాత హీరోగా ఓ పాతిక సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం దక్కలేదు. కారణం ఏంటనేది తెలియదు … టైమ్ బాగోలేదనుకున్నాను. కొత్త హీరోలు రావడం అందుకు ఒక కారణం కావొచ్చునేమో” అని చెప్పాడు.

You may also like
ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ పటేల్..కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ !
అందరూ స్వదేశీ..ప్యాట్ కమిన్స్ ఒక్కడే !
ఆస్ట్రేలియాలో హొలీ..టీం ఇండియా ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్
harihara veera mallu
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions