- మనదేశం నుంచి దొంగలించబడిన ప్రాచీన వస్తువులను అప్పగించనున్న అగ్రరాజ్యం
- ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ వెల్లడి
US to Return Antiquities | భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనలో భాగంగా రోనాల్డ్ రీగన్ సెంటర్ లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోదీ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా భారత దేశం నుండి దొంగిలించబడిన పురాతన వస్తువుల్ని అమెరికా.. భారత దేశానికి తిరిగి ఇవ్వబోతోందని ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
పురాతన వస్తువులు అంటే మన సంస్కృతికి, సంప్రదాయానికి, ప్రాచీన కాలంలో మన జీవన విధానానికి చిహ్నాలు.
కొన్ని శతాబ్దాల నుండి విదేశీయులు, కొన్ని దొంగల ముఠాలు భారత్ నుండి లెక్కించలేనాన్ని పురాతన వస్తువుల్ని అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి మార్కెట్స్ లో అమ్మేవారు.
Read Also: పుతిన్ కు షాక్.. రష్యాలో తిరుగుబాటు.. ఏంటీ వాగ్నర్ గ్రూప్.. ఎవరీ ప్రిగోజిన్..!
2014 మోదీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఏ విదేశీ పర్యటనకు వెళ్లిన అక్కడి అధికారులతో చర్చించి భారత్ నుండి దొంగిలించి అక్రమంగా విదేశాలకి తరలించిన పురాతన వస్తువుల్ని భారత్ కి తిరిగి తీసుకువస్తున్నారు.
అలా 2014 నుండి ఇప్పటి వరకు సుమారు 238 పురాతన వస్తువుల్ని తిరిగి మన దేశానికి తీసుకువచ్చారు.
అదేవిధంగా గతేడాది అక్టోబర్ లో భారత్ కి చెందిన 307 పురాతన వస్తువులను (వాటి విలువ 4మిలియన్ అమెరికన్ డాలర్స్) భారత్ కి అప్పచెప్పబోతున్నామని మ్యాన్ హట్టన్ లో అటార్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్ ప్రకటించారు.
భారత ప్రభుత్వ ప్రయత్నాల ద్వారా మన ప్రాచీన నాగరికత యొక్క వైభవాన్ని ప్రతిభింభించే మన దేశ కళాకాండలను తిరిగి భారత్ కు తీసుకురావడం హర్షణీయం, అభినందనీయం.