Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 9 నెలలకే కుప్పకూలిన భారీ శివాజీ విగ్రహం

9 నెలలకే కుప్పకూలిన భారీ శివాజీ విగ్రహం

35 Foot Shivaji Statue Collapses In Maharastra | మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహరాజ్ ( Maharaj Shivaji Maharaj )భారీ విగ్రహం సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది.

మహారాష్ట్ర సిందుదుర్గ్ ( Sindhudurg ) జిల్లా మాల్వాన్ లోని రాజకోట్ ఫోర్ట్ గతేడాది 35 అడుగుల భారీ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

డిసెంబర్ 4 2023న నౌకాదళ ( Navy Day ) దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ, సీఎం ఎక్నాథ్ షిండే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ప్రారంభించిన కేవలం 9 నెలలకే విగ్రహం కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది.

గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తున్నాయి. కాకపోతే విగ్రహం కూలిపోవడానికి కారణం ఎంటనేది అధికారికంగా తెలియాల్సివుంది. ఇప్పటికే అధికారులు శివాజీ విగ్రహం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు.

You may also like
జట్టు కట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ-కాంగ్రెస్
కేరళ ఎర్రకోటలో కాషాయ రెపరెపలు
మోదీ-పుతిన్..ఓ ఫార్చూనర్
మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఐశ్వర్య

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions