Chiranjeevi Emotional Post | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirnajeevi) సతీమణి సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవి తన భార్య సురేఖకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మరో రెండు రోజుల్లో వారి వివాహవార్షికోత్సవం కూడా ఉన్న నేపథ్యంలో రెండు సందర్భాలను ప్రస్తావిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన భార్య సురేఖ అని తెలిపారు. “నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు.
1980 ఫిబ్రవరి 20న మనం వివాహ బంధంతో ఒక్కటైన నాటినుంచి నువ్వే నా బలంగా మారావు. ఈరోజు నీ పుట్టినరోజుతో పాటు రెండు రోజుల ముందుగానే మన వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
నీ ప్రేమ, ఆప్యాయతలతోనే మన కుటుంబాన్ని నడిపిస్తున్నావు. నా తల్లిని సొంత బిడ్డలా చూసుకుంటావు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే.. నా ప్రతిభ, కృషి కాదు.. నువ్వే అని చెబుతాను. నువ్వు కుటుంబ బాధ్యతను చూసుకున్నావు కాబట్టే నేను నటనపై శ్రద్ధ పెట్టగలిగాను.
కష్టసుఖాల్లో మమ్మల్ని ఒకేతాటిపై నడిపించావు. నీవల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని చిరంజీవి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను పంచుకున్నారు.










