Wednesday 7th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్..కన్నీరు పెట్టుకున్న స్టార్ ప్లేయర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్..కన్నీరు పెట్టుకున్న స్టార్ ప్లేయర్

Matt Henry Breaks Down After Missing Champions Trophy 2025 Final |ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరం ప్రారంభమయ్యింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా-న్యూజిలాండ్ జట్లు తలపడ్డ విషయం తెల్సిందే.

అయితే మ్యాచ్ ప్రారంభం కంటే ముందు న్యూజీలాండ్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ ( Matt Henry ) కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాస్ గెలిచిన న్యూజీలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

సెమీ ఫైనల్ మ్యాచ్ లో గాయపడ్డ మ్యాట్ హెన్రీ ఇంకా పూర్తిస్థాయి ఫిట్ నెస్ ను సాధించలేదు. ఈ క్రమంలో హెన్రీ స్థానంలో నాథన్ స్మిత్ ( Nathan Smith ) తుది జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో మ్యాట్ హెన్రీ కన్నీరు పెట్టుకున్నారు. ఫైనల్ మ్యాచ్ లో ప్రాతినిధ్యం వహించకపోవడంతో హెన్రీ మైదానంలోనే భావోద్వేగానికి గురయ్యారు.

అతన్ని జట్టు కోచ్ ఓదార్చారు. 10 వికెట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా హెన్రీ ఉన్నారు. బుధవారం లాహోర్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీస్ లో హెన్రిచ్ క్లాసెన్ ( Klassen ) ఆడిన బంతిని క్యాచ్ పట్టె క్రమంలో హెన్రీ తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే.

You may also like
‘సింధూర్’..ఆపరేషన్ కు ఈ పేరు అందుకే పెట్టారు!
‘కేవలం 25 నిమిషాల్లోనే..ప్రపంచమే ఉలిక్కిపడేలా’
విజయ ‘సింధూరం’..భారత్ ప్రతీకారం
‘సమాచారం ఉన్నా ఉగ్రదాడిని ఎందుకు అడ్డుకోలేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions