Saturday 9th August 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కాంగ్రెస్ లోకి బీఆరెస్ ఎమ్మెల్యే.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనయర్ నేత!

కాంగ్రెస్ లోకి బీఆరెస్ ఎమ్మెల్యే.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనయర్ నేత!

బీఆరెస్ పార్టీ నుంచి ఎన్నికైన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే సంజయ్ చేరిక పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంసతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవటంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబెకుతోంది. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భవిషత్ కార్యాచరణ పై కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరోవైపు పలువురు కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డితో చర్చించి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

You may also like
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం
చెప్పులు కూడా లేని చిన్నారి..మంత్రి సురేఖ ఏం చేశారంటే !
తెలంగాణ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions