Shubhanshu Shukla turns farmer in space; grows methi, moong seeds | ఆక్సియమ్-4 (Ax-4) మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో మెంతి (Fenugreek) మరియు పెసర (Moong) విత్తనాలను పెంచే ప్రయోగాన్ని నిర్వహించారు.
ఈ ప్రయోగం అంతరిక్షంలో ఆహార ఉత్పత్తి సాధ్యాసాధ్యాలను అన్వేషించడం, భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష మిషన్‌ల కోసం స్వయం-సమృద్ధ వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయడం కోసం రూపొందించబడింది.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి, పెసర సాగుపై ఉండే ప్రభావాన్ని అధ్యాయనం చేస్తున్నారు. ధార్వాడ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన రవికుమార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే శాస్త్రవేత్తల సహాయంతో శుభాంశు శుక్లా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
మెంతి మరియు పెసర విత్తనాలను హైడ్రోపోనిక్ విధానాల ద్వారా పెంచారు. ఇది భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఆహార సరఫరా సాధ్యాసాధ్యాలను సూచిస్తుంది. జీరో గ్రావిటీలో విత్తనాలు ఏ విధంగా మొలకెత్తుతాయి అనే అంశంపై శుభాంశు పరిశోధన చేశారు. భూమిపైకి వచ్చాక మొలకలలో వచ్చిన జన్యు మార్పులను మరియు పోషక విలువలను పరిశీలించనున్నారు.









