Fight In Tirumala Queue | తిరుమల (Tirumala)లో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు వేచి చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. ఇరువురు భక్తులు ఘర్షణకు దిగారు.
ఈ సమయంలో ఓ భక్తుడు తన బెల్ట్ తీసి దాడి చేసే యత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పందించింది.
భక్తులు సంయవనం పాటించాలని కోరింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణతేజ అతిథి భవనం సమీపంలోని క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు ఘర్షణకు దిగిన సంఘటన సోమవారం చోటుచేసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఘర్షణను నిలువరించినట్లు వెల్లడించింది. అయితే శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇలా పరస్పరం ఘర్షణకు దిగడం సమంజసం కాదని టీటీడీ హితవుపలికింది.
ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ ఇతర భక్తులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించింది. అలాగే క్యూ లైన్ నియమాలను పాటించాలని టీటీడీ కోరింది










