Ys Sharmila On Gudlavalleru College Incident | గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ( Gudlavalleru Engineering College )లో రహస్య కెమెరాల ఉదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆడపిల్లల బాత్ రూముల్లో రహస్య కెమెరాలు, 3వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Ys Sharmila ).
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు.
కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు.ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు, ఫాస్ట్రాక్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేన్నారు.
బాత్ రూముల్లో రికార్డ్ ( Record ) అయిన ఏ వీడియో ( Video ) కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు షర్మిల విజ్ఞప్తి చేశారు.
వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే తానే కాలేజీని సందర్శిస్తానని ఎక్స్ ( X )వేదికగా వైఎస్ షర్మిల పోస్ట్ చేసారు.