Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కు షర్మిల హితవు

పవన్ కు షర్మిల హితవు

Ys Sharmila News | ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం అని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే అవుతుందన్నారు. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని హితవుపలికారు. శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదన్నారు. మూడ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు సబబు కాదని చురకలు అంటించారు. కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించాలని స్పష్టం చేశారు. రూ.3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions