Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా: వైఎస్ షర్మిల

నాకు ఈ పరిస్థితి రావడం మీకు అవమానం కాదా: వైఎస్ షర్మిల

sharmila

Ys Sharmila News| రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అలాగే మెగా డీఎస్సి ( Mega DSC ) కోసం డిమాండ్ ( Demand ) చేస్తూ గురువారం చలో సెక్రటేరియట్ ( Secretariat ) కు పిలుపునిచ్చింది ఆంధ్రా కాంగ్రెస్ పార్టీ ( Congress party ).

ఈ నేపథ్యంలో విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రారత్న( Andhra Ratna ) భవన్ లో బుధవారం రాత్రి బస చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Ys Sharmila ).

దింతో గురువారం ఉదయం కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీగా మోహరించాయి పోలీస్ ( Police ) బలగాలు. భవన్ నుండి బయటకు వచ్చిన గిడుగు రుద్రరాజు,మస్తాన్ వలీ, తులసిరెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఈ సందర్భంగా స్పందించిన వైఎస్ షర్మిల..” నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ ( House Arrest ) లు చేయాలని చూస్తారా ? నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ( Office ) రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? వైసీపీ ( Ycp ) నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు.మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే.23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి.” అని డిమాండ్ ( Demand )చేశారు షర్మిల.

You may also like
జ్వరాలు రాష్ట్రాన్ని వణికిస్తుంటే..సూది గుచ్చినట్టైనా లేదు
Babu at Tirumala
చంద్రబాబు రహస్యంగా బెంగళూరు వెళ్లారు..FACT CHECK క్లారిటీ
duvvada srinivas
దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చిన పార్టీ అధిష్టానం..!
egg puffs
EGG PUFFల ఖర్చు రూ.3.6 కోట్లు.. స్పందించిన వైసీపీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions