Ys Jagan On Haryana Election Results | మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( Ys Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయన్నారు.
హర్యానా ఫలితాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్న అంశాన్ని పేర్కొన్నారు.
అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్లనే వినియోగిస్తున్నారని గుర్తుచేశారు. మనం కూడా తిరిగి బ్యాలెట్ ( Paper Ballot ) లను వాడాలని, అప్పుడే ఓటర్లలో విశ్వాసం పెరుగుతుందన్నారు.
ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకురావలని కోరారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండడమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని సూచించారు. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.









