Ys Jagan News Latest | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హెలికాప్టర్ ఇవ్వొద్దని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నుండి విమానయాన సంస్థలకు బెదిరింపులు వెళ్తున్నాయని వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.
జగన్ ను ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జగన్ పార్టీ ఆరోపించింది. కాగా ఇటీవల జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాల పట్ల వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాపిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో జగన్ హెలికాఫ్టర్ దిగిన వెంటనే అభిమానులు, పార్టీ శ్రేణులు హెలిప్యాడ్ వద్దకు దూసుకువచ్చిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో కార్యకర్తల తాకిడి మూలంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. అయితే పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. జగన్ పర్యటనకు ఆటంకాలు కలిగించాలని కూటమి సర్కార్ కుట్రలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పైలట్, కో పైలట్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపినట్లు ఏపీ పోలీసులు తెలిపారు.