Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > EVMలపై జగన్ మరోసారి హాట్ కామెంట్స్

EVMలపై జగన్ మరోసారి హాట్ కామెంట్స్

Ys Jagan Hot Comments On EVM’s | వైసీపీ అధినేత జగన్ మరోసారి ఈవిఎంల పై అనుమానం వ్యక్త పరిచారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

మన రాజ్యాంగం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందన్నారు జగన్ .ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని పేర్కొన్నారు.

అయితే ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నదని, వీటి పనితీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతున్నాయన్న అంశాన్ని గుర్తుచేశారు.

‘అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. ఉన్నట్టుగా కూడా కనబడాలి. అందరి ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యం కొంతకాలంగా అణచివేయబడుతోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సహా రాజ్యాంగాన్ని రూపొందించిన మన దార్శనిక నాయకులు సమానత్వం వైపు నడిపించారు’ అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions