Yashasvi Jaiswal Gutted After Runout | డబుల్ సెంచరీ సాధించే అవకాశం చేజారిపోవడంతో టీం ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆవేదన చెందాడు. ఇదే సమయంలో కెప్టెన్ గిల్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
టీం ఇండియా-వెస్ట్ ఇండీస్ మధ్య రెండవ టెస్టు మ్యాచ్ కొనసాగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శుక్రవారం మ్యాచ్ ప్రారంభం అయింది. మొదటి రోజు ఓపెనర్ జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. రెండవ రోజు కూడా దూకుడుగా ఆడుతుండడంతో డబుల్ సెంచరీ ఖాయం అని అభిమానులు సంబరపడ్డారు. ఇదే సమయంలో 92వ ఓవర్ లో అతడు దురదృష్టవశాత్తు రన్ ఔట్ అవ్వాల్సి వచ్చింది.
జైదెన్ సీలెస్ వేసిన 92 ఓవర్ లో రెండవ బంతిని జైస్వాల్ మిడ్ఆఫ్ వైపు కొట్టాడు. అనంతరం పరుగు ప్రారంభించాడు. మరో ఎండ్ లో ఉన్న గిల్ కూడా తొలుత పరుగు తీసేందుకు ఓకే అన్నాడు. కానీ ఆ తర్వాత వెనక్కు తిరిగాడు. అప్పటికే జైస్వాల్ సగం పిచ్ దాటేశాడు. గిల్ నో చెప్పడంతో తిరిగి గ్రీస్ లోకి వెళ్ళేలోపే రన్ ఔట్ అయ్యాడు.
దింతో 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆవేదనకు గురైన జైస్వాల్ గిల్ పై అసహనం వ్యక్తం చేశాడు. తలపై చేతితో కొట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో గిల్ పై కొందరు నెటీజన్లు విమర్శలు చేస్తున్నారు.









