Water Leak In New Parliament Building | నూతన పార్లమెంటు ( Parliament ) భవనంలో వర్షం నీరు లీక్ కావడం రాజకీయ దుమారం రేపుతోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ( Central Vista Project )లో భాగంగా గతేడాది నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే.
కాగా గత కొన్ని రోజులుగా దేశ రాజధాని వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లాబీలో వాటర్ లీక్ ( Water Leak ) అవుతున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాగూర్ ( Manickam Tagore ) ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
బయట పేపర్ లీక్..లోపల వాటర్ లీక్ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి వినియోగించిన పార్లమెంటు లాబీలో వాటర్ లీక్ అవ్వడం నూతన భవనంలోని సమస్యలను ఇది చెబుతోందని మానిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై పార్లమెంటులో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు వాటర్ లీక్ ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ ( Akhilesh Yadav ) యాదవ్ స్పందించారు.
బీజేపీ హయాంలో అద్భుతంగా ఆలోచించి నిర్మించిన ప్రతి నిర్మాణం నుండి నీరు లీక్ అవుతుందా అని ప్రజలు అడుగుతున్నారని అఖిలేష్ ఎద్దేవా చేశారు.