Virat Kohli’s Six Hits Security Guard In Perth | విరాట్ కోహ్లీ కొట్టిన ఓ సిక్స్ ( Six ) సెక్యూరిటీ సిబ్బంది తలకు తగిలింది. బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో భాగంగా పెర్త్ ( Perth ) వేదికగా ఆస్ట్రేలియా, టీం ఇండియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ కొనసాగుతుంది.
మూడవ రోజు టీం ఇండియా ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. 100 వ ఓవర్ ను ఆసీస్ బౌలర్ స్టార్క్ బౌలింగ్ చేస్తున్నాడు. స్టార్క్ వేసిన ఓవర్ 5వ బాల్ ని కోహ్లీ కట్ షాట్ ఆడాడు.
దింతో బాల్ బౌండరీ బయట పడింది. అక్కడే కూర్చున్న సెక్యూరిటీ తలకు బాల్ వెళ్లి బలంగా తగిలింది. దింతో సెక్యూరిటీకి ఎలా ఉందో అంటూ కోహ్లీ అటువైపు చూసాడు. ఇంతలోనే ఆస్ట్రేలియా ఫిజియో అక్కడికి పరుగెత్తుకుంటు వెళ్లి సెక్యూరిటీతో మాట్లాడారు.