Virat Kohli chants ‘Jai Shree Mahakal’ during visit to Mahakaleshwar Temple | టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ లోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ‘జై శ్రీ మహాకాల్’ అని మీడియా ప్రతినిధులను, అభిమానులను పలకరించారు. ఇందౌర్ వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున విరాట్ కోహ్లీ, బౌలర్ కుల్దీప్ యాదవ్ మరియు టీం ఇండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు.
మహాకాళేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భస్మ హారతిలో పాల్గొన్నారు. ఇకపోతే భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచులో విజయం సాధించాయి. మూడవ మ్యాచ్ ను గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకోనుంది.









