Virat Kohli Bumps Sam Konstas | మెల్బోర్న్ ( Melbourne ) వేదికగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలైన బాక్సింగ్ డే టెస్టు ( Boxing Day Test ) మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది.
టాప్ ఫోర్ బ్యాట్సమెన్స్ ( Batmens ) అర్ధశతకాలతో చెలరేగిపోయారు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ ( Steve Smith ), ఫ్యాట్ కమిన్స్ ( Pat Cummins ) క్రీజ్ లో ఉన్నారు.
ఇదిలా ఉండగా మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కానస్టాస్ ( Sam Konstas ) మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బుమ్రా వేసిన 11వ ఓవర్ లో బాల్ విరాట్ కోహ్లి వద్దకు వెళ్ళింది. దింతో విరాట్ బాల్ ను తీసుకుని నాన్ స్ట్రైకర్ వైపు వస్తుండగా కానస్టాస్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్నాడు.
వీరిద్దరూ ఎదురుపడగానే భుజాలు తాకాయి. వెంటనే కానస్టాస్ ఏదో వ్యాఖ్య చేయగా కోహ్లీ కూడా దీటుగా బాదులిచ్చాడు. వెంటనే ఎంపైర్లు, ఆస్ట్రేలియా మరో ఓపెనర్ కలుగచేసుకొని వాగ్వాదాన్ని చక్కదిద్దారు.
అయితే ఈ ఘటనపై ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ ( Ricky Ponting ) స్పందిస్తూ..విరాట్ కోహ్లీని చూడండి, అతని నడుస్తున్న తీరు చూస్తేనే తెలిసిపోతుంది అని పేర్కొన్నారు. రవిశాస్త్రి కూడా స్పందిస్తూ విరాట్ ను తప్పుబట్టారు.