Vijay Mallya, Lalit Modi At Lavish UK Party | దేశంలో తీవ్రమైన ఆర్ధిక ఆరోపణలు ఎదురుకుంటూ లండన్ పారిపోయిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా ఒకే పార్టీలో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో వైరల్ గా మారింది.
లలిత్ మోదీ మరియు విజయ్ మాల్యా లండన్‌లో జరిగిన ఒక గ్రాండ్ సమ్మర్ పార్టీలో “ఐ డిడ్ ఇట్ మై వే” (I Did It My Way) అనే ఇంగ్లీష్ పాటను పాడుతూ కనిపించారు. ఈ పార్టీ లండన్ లోని లలిత్ మోదీ నివాసంలో జరిగింది. లలిత్ మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పార్టీకి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
ఇందులో 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని, వీరిలో అనేక దేశాల నుండి ప్రత్యేకంగా వచ్చిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా పాల్గొన్నారు.
లలిత్ మోడీ మరియు విజయ్ మాల్యా ఇద్దరూ భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు. లలిత్ మోడీ 2010లో (బీసీసీఐ) నుండి సస్పెండ్ అయిన తర్వాత యూకే వెల్లుపోయారు.
ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీ లాండరింగ్, ఫారిన్ ఫెమా ఉల్లంఘనలతో సహా చాలా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా, విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి 9,000 కోట్ల రూపాయల రుణ డిఫాల్ట్ మరియ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ 2016లో భారతదేశం నుండి యూకేకు పారిపోయారు.
కాగా వైరల్ గా మారిన వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ..భారత ప్రజలను మోసగించిన సొమ్ముతో విదేశాల్లో పార్టీలు చేసుకుంటున్నారు అని మండిపడుతున్నారు.