Friday 27th June 2025
12:07:03 PM
Home > తాజా > “నిజస్వరూపం బయటపెట్టుకున్న కాంగ్రెస్”

“నిజస్వరూపం బయటపెట్టుకున్న కాంగ్రెస్”

Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly

– రేవంత్ హామీ ప్రకారం నిన్న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన

Union Minister Kishan Reddy | ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువతకోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని.. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా.. మరి నిన్ననే ఒకటో తేది. ఇది ఫిబ్రవరి నెలే. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది. మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదు’ అని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

‘హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన.. కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసింది. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోంది’ అని కిషన్ రెడ్డి అన్నారు.

You may also like
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!
cm revanth meets jana reddy
జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!
Metro
మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
‘వాళ్ల అసలు రంగు బయటపడింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions